BREAKING
కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఆత్మనిర్భర్ బీహార్ నిర్మాణమే లక్ష్యం అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్ ధరలను 6 శాతం వరకు తగ్గించిన ఫినోలెక్స్ కేబుల్స్.. ఇఫ్ఫీ 2026లో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఆరవ ఎడిషన్ ప్రారంభం గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..! హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..! బీజేపీలో చేరిన యువకులు 8వ వేతన సంఘం... ఇఫ్ఫీ 2026లో ఏడుగురు సినీ దిగ్గజాలకు నివాళి అంతంపల్లిలో చేయూత ఆసరా పెన్షన్ల పత్రాల పంపిణీ

శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో 65వ ఫార్మసీ వారోత్సవాలు

Select Suryaa Now
శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో 65వ ఫార్మసీ వారోత్సవాలు
సూర్య తిమ్మాపూర్ ; తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో 65వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్‌రెడ్డి ప్రారంభించిన వారోత్సవాల్లో విద్యార్థులు ప్రజలకు మందుల వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. ఫార్మాక్విజ్, సైటూన్స్, లీఫ్లెట్, పోస్టర్ ప్రజెంటేషన్, రీల్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పి. రాజేంద్రప్రసాద్, ఎండీ (జనరల్ మెడిసిన్), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కరీంనగర్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్), యాంటీబయాటిక్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. పోటీల్లో విజేతలకు చైర్మన్ ముద్దసాని రమేష్‌రెడ్డి, డైరెక్టర్ కె. సౌందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డీవీఏ రామనర్సింహారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీలు డాక్టర్ ఎం. శ్రీనివాస్, డాక్టర్ జి. చంద్రమౌళి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.