telangana
మహిళల ఆరోగ్యంపై వాగేశ్వరిలో జాతీయ సదస్సు
సూర్య తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఐసీఎస్ఎస్ఆర్ సహకారంతో ‘ఎంపవరింగ్ ఉమెన్స్ హెల్త్: అవేర్‌నెస్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. రెండో రోజు డాక్టర్ బి. శ్రీజ మెనోపాజ్, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, హార్మోన్ల మార్పులు, ఎముకలు, గుండె ఆరోగ్యం గురించి వివరించగా, డాక్టర్ అర్జుమండ్ బాలికల పోషకాహారం, రక్తహీనత, రుతుక్రమ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. డాక్టర్ అవని భరద్వాజ్ మహిళల్లో ఆటో ఇమ్యూన్, రుమాటిక్ వ్యాధులు, వాటి నివారణ, చికిత్సలపై ప్రసంగించారు. రెండు రోజుల సదస్సులో విద్యార్థులు సుమారు 50 పోస్టర్ ప్రజెంటేషన్లు నిర్వహించగా, ఉత్తమ మూడు ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ గండ్ర శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, వినోద్, సిహెచ్. ప్రకాష్ రెడ్డి, డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఆర్. రామకృష్ణ, డాక్టర్ మాధవి రెడ్డి, డాక్టర్ నిఖిల్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.