BREAKING
జిల్లాలో 'సంజీవని' వైద్య సేవ‌ల‌కు సిద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ వైల్డ్‌బెర్రీస్ సీఈఓ పదవి నుంచి తట్యానా కిమ్ వైదొలిగారు 60 ఏళ్ల తర్వాత అంజన్న నిజరూప దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విద్యుత్ సరఫరా ప్రాజెక్టును దక్కించుకున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్! కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఆత్మనిర్భర్ బీహార్ నిర్మాణమే లక్ష్యం అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్ ధరలను 6 శాతం వరకు తగ్గించిన ఫినోలెక్స్ కేబుల్స్.. ఇఫ్ఫీ 2026లో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఆరవ ఎడిషన్ ప్రారంభం గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..! హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..!

యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు

Select Suryaa Now
యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు
సూర్య, జన్నారం : యోగాతో ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, వ్యక్తిత్వ వికాసానికి పెద్దగా దోహదపడుతుందని బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం నాయకపల్లి యోగ పీఠం శంకరాచార్యులు అన్నారు. శనివారం జన్నారం మండల కేంద్రంలో గల జ్యోతి గార్డెన్లో జరిగిన బ్రహ్మ జ్ఞాన యోగ విద్య సంకల్ప సమాలోచన వేదిక ఆధ్వర్యంలో జాతీయస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర లిటిల్ హాన్స్ విద్యార్థులచే యోగ ఆసనాలు చేయించారు. అనంతరం శంకరాచార్యులు మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్న వయసు నుంచే అనేకమంది మానసిక ఒత్తిళ్లు, జీవనశైలి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించేందుకు యోగ, ధ్యానం ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యావ్యవస్థలో యోగ అమలు చేస్తే ఆరోగ్యవంతమైన క్రమశిక్షణ కలిగిన సంస్కారవంతమైన భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దవచ్చన్నారు. యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే మహా సంకల్పం ప్రధాన లక్ష్యమని అన్నారు. జ్ఞానానందగిరి మహారాజ్, ఆదిత్య చిల్డ్రన్ హాస్పిటల్ డైరెక్టర్ మగ్గిడి తిరుపతి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమానికి మాజీ జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పలువురు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.