BREAKING
ఇఫ్ఫీ 2026లో ఏడుగురు సినీ దిగ్గజాలకు నివాళి అంతంపల్లిలో చేయూత ఆసరా పెన్షన్ల పత్రాల పంపిణీ జలాల్పూర్‌లో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ 404 చిత్రాలలో 25 ఫీచర్ సినిమాలు ఎంపిక, సినీ వైవిధ్యానికి పట్టం చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి నవంబర్ 22న పల్స్ పోలియో కార్యక్రమం శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో 65వ ఫార్మసీ వారోత్సవాలు సర్పంచ్ ఎన్నికలకు 23 నామినేషన్లు దాఖలు మహిళల ఆరోగ్యంపై వాగేశ్వరిలో జాతీయ సదస్సు ఇఫ్ఫీ 2026లో ఇండియన్ పనోరమా ప్రారంభం రేవంత్ రెడ్డి ప్రసంగంలో సౌండ్ ఎక్కువ.. సొల్యూషన్ తక్కువ! నల్ల సముద్ర వివాద పరిష్కారానికి భారత్ కృషిపై బల్గేరియా ప్రశంసలు ఘనంగా కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన సంబరాలు ఐటీఐ టాపర్లను సత్కరించనున్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి కి స్వాగతం పలికిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు.

మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ

Select Suryaa Now
మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ
సూర్య తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, ఎల్‌ఎండీ కాలనీలోని కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి, సిద్దిపేట వారి ఆధ్వర్యంలో, నాట్కో ఫార్మా ఆర్థిక సహకారంతో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి ప్రతినిధులు వంశీధర్, జతిన్, ఎల్లారెడ్డిపేట గౌట్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హమ్మద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, ట్రస్టు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, ట్రస్టు సభ్యులు, ఉపాధ్యాయులు మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. పిల్లలకు ప్రభుత్వం తరఫున ప్రతిరోజూ ఉదయం టిఫిన్ అందిస్తామని, పాఠశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.110 మంది ఉచితంగా కంటి అద్దాలు పొందామని వారు చాలా ఆనందం  వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మేనేజంగ్ ట్రస్టీ  బొజ్జపురి వెంకటయ్య,ట్రస్ట్ సభ్యులు గాజుల భగవాన్, గుర్రం కొముర ఎల్లారెడ్డి,అశోక్ ముఖర్జీ,మధుసూదన్ రావు తేరాల సత్యనారాయణ, రమణారెడ్డి,ఏవో ఈ బాలరాజు, పాఠశాల ప్రిన్సిపాల్ నాంపల్లి సతీష్,VTC ఇన్స్ట్రక్టర్ వి రమేష్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పిల్లలతల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.