BREAKING
ఐటీఐ టాపర్లను సత్కరించనున్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి కి స్వాగతం పలికిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ నిధులు కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ .. రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు బీహార్ అభివృద్ధికి భారీ ఊతం పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలి.

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి  మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలి.

రామాయంపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు, లబ్ధిదారులు సమన్వయంతో కృషి చేయాలని తహసిల్దార్ రజనీకుమారి ఎంపీడీవో షాజీలోద్దీన్ సూచించారు.రామాయంపేట మండల పరిధిలోని దంతపల్లి గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ మస్కూరి బాలరాజు ఆధ్వర్యంలో తహసిల్దార్ రజిని కుమారి  ఎంపీడీవో షాజీలోద్దీన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అదేవిధంగా నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని తెలిపారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, గుడిసెలేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు