telangana
ప్రజా సమస్యల పరిష్కారానికి కేఎన్నార్ మార్నింగ్ వాక్
సూర్య కరీంనగర్ : ప్రజా సమస్యలు తెలుసుకొని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేఎన్నార్ మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం ఉదయం అంబేడ్కర్ స్టేడియంలో వాకర్స్, క్రీడాకారులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు గతంలో కేటాయించిన రూ.95 లక్షల సుడా నిధులతో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరుగుదొడ్లు పనిచేయక మహిళలు, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని వాకర్స్ తెలపడంతో అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో పనులు ప్రారంభించి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.