BREAKING
ఐటీఐ టాపర్లను సత్కరించనున్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి కి స్వాగతం పలికిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ నిధులు కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ .. రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు బీహార్ అభివృద్ధికి భారీ ఊతం పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల అవగాహన సదస్సు...

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల అవగాహన సదస్సు...

దుబ్బాక ..దుబ్బాక మండలంలోని మాస్టర్ మైండ్ విద్యాలయంలో ఎల్‌నినో  ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరత, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణలతో సులభంగా అర్థమయ్యే రీతిలో రాబోయే కాలంలో ఎదురయ్యే సమస్యలను వివరించారు. నీటి కొరత, విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను తెలియజేశారు.ముఖ్యంగా రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల ప్రభావంతో వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని, రైతులకు సాగు మరింత కష్టతరంగా మారవచ్చని విద్యార్థులు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో నీటిని పొదుపుగా వినియోగించాలని, అవసరం లేకుండా నీటిని వృథా చేయరాదని సూచించారు. అలాగే విద్యుత్‌ను కూడా అవసరమైనప్పుడే వినియోగిస్తూ పొదుపు చర్యలు పాటించాలని సందేశమిచ్చారు.
విద్యార్థులే స్వయంగా వివిధ పాత్రలు పోషిస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని అందించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఎనిమిదో తరగతి విద్యార్థులు తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపు, విద్యుత్ ఆదాపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఈ కార్యక్రమం అభినందనీయంగా నిలిచింది.