BREAKING
ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ నిధులు కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ .. రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు బీహార్ అభివృద్ధికి భారీ ఊతం పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ మనస్తాపంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల అవగాహన సదస్సు...

విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి...

Select Suryaa Now
విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి...

దుబ్బాక ; పి యం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దుబ్బాక లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణుల కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్  అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలని, మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడం ద్వారా నిజాయితీ క్రమశిక్షణ, పెద్దలపట్ల గౌరవం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతుందని లీడ్ ఇండియా ఫౌండేషన్ కోఆర్డినేటర్ టి.శ్రీనివాస్ ఆచార్య, విశ్రాంత కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం దుబ్బాక పట్టణంలోని పీఎంశ్రీ జడ్పీ జిహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం పట్నం భూపాల్ సహకారంతో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష పరిజ్ఞానం కలిగి ఉన్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులచే విద్యార్థులకు పరస్పర చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు- జీవన నైపుణ్యాలు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ కెరీర్ అవకాశాలపై అవగాహన, ప్రపంచ దేశాల్లో విద్యా, ఉపాధి రంగ అవకాశాలను అందిపుచ్చుకోవడం, గ్రాఫాలజీ (చేతిరాత) తదితర అంశాలపై విషయ నిపుణులు అవగాహన కల్పించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు గెలుపును వినయంతో, ఓటమిని హుందాగా స్వీకరించే క్రీడా స్ఫూర్తి, బృందస్ఫూర్తి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రాఫాలజిస్ట్ సత్య ప్రకాష్, మోటివేషనల్ స్పీకర్ చిరంజీవి, సైకాలజిస్ట్ నాగేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు గాజుల రామచంద్రం,  యం.పద్మ, సదాలక్మి,ఉమా ,సవిత , శివలీల, గువ్వల నాగేశ్వరరావు, రజిత, సిఆర్పి రవి, సంధ్యారాణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.