BREAKING
ఐటీఐ టాపర్లను సత్కరించనున్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి కి స్వాగతం పలికిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ నిధులు కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ .. రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు బీహార్ అభివృద్ధికి భారీ ఊతం పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

ముగిసిన రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ పోటీలు - బహుమతులు అందజేసిన  "బండి" , " కవ్వంపల్లి"

Select Suryaa Now
ముగిసిన రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ పోటీలు - బహుమతులు అందజేసిన  "బండి" , " కవ్వంపల్లి"
సూర్య తిమ్మాపూర్ : కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని అలుగునూర్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా క్రికెట్ అభివృద్ధి టోర్నమెంట్ పేరిట  నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన జట్లకు, క్రీడాకారిణులకు వారు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, ముఖ్యంగా ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని కొనియాడారు. క్రీడల్లో మహిళలు మరింతగా రాణించేందుకు తగిన అవకాశాలు, ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు హెచ్‌సీఏ ఇలాంటి రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా జిల్లాల స్థాయిలోని ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లను గుర్తించి, వారిని భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాభిమానులు, క్రీడాకారిణులు తదితరులు పాల్గొన్నారు. అల్గునూరు లోని వెలిచాల జగపతి రావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్ లో ఈనెల 11 నుంచి 21వ జరిగిన ఈ టోర్నమెంట్ లో 120 మంది ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్ల తో కూడిన 8 జట్లు పాల్గొన్నాయి