ఈనెల 23న దర్శి మున్సిపల్ చైర్మన్ గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం.
సూర్య న్యూస్ దర్శి.ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు దర్శి మున్సిపల్ చైర్మన్‌గా దారం సుబ్బారావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు, నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , కడియాల లలిత సాగర్ , మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు , మాజీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య హాజరుకానున్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో ఉన్న పిజియన్ కాంప్లెక్స్‌లో బహిరంగ సభతో పాటు విందు భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చైర్మన్ దారం సుబ్బారావు వెల్లడించారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చైర్మన్ సుబ్బారావు కోరారు.