BREAKING
మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు *పత్రికా ప్రకటన* *తేదీ: 22.11.2026* *ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు* *- నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు* కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వ్యాధుల నివారణ, ప్రెసిషన్ మెడిసిన్ వైపు భారత్ వైద్య పరిశోధనల అడుగులు 250 మందికి ఉచిత వైద్య సేవలు చిన్నారుల మధ్య ఘనంగా ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు చారిత్రక చంగిస్ ఖాన్ పేట 5వ వార్డు సభ్యురాలిగా ఇనాదుల శిరీష ఏకగ్రీవం దేవంపల్లి గ్రామ పాలచెరువుకు జలకళ.. ముందస్తు చర్యలతో రైతులకు భరోసా! అధిష్ఠానం ఆదేశాలను నూరు శాతం పాటిస్తా పంచాయతీల్లో పోటీ వద్దు...ఏకగ్రీవాలకే మొగ్గు బలహీనపడిన అక్వాన్ తుపాను కురువ శశికళ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపిన బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ దంపతులు ఈశాన్య ప్రాంత అభివృద్ధి, యువత ఉపాధే మోదీ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యం రాజు బాంగారుపాలెం ఫ్లాగ్ మార్చ్

ఏ.కొండూరులో పులి సంచారంపై పవన్ కల్యాణ్ సమీక్ష..

Select Suryaa Now
ఏ.కొండూరులో పులి సంచారంపై పవన్ కల్యాణ్ సమీక్ష..

అమరావతి: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు పరిసర ప్రాంతాల్లో పులి సంచారం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పులి కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, దానికి ఎలాంటి హాని కలగకుండా ప్రజల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దట్టమైన ప్రాంతాల్లో పులి జాడను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ఏఐ (AI) కెమెరాలను వినియోగించాలని సూచించారు. పులి ఏయే మార్గాల్లో సంచరిస్తోందో గుర్తించడంతో పాటు, 'హనుమాన్' బృందాలతో ప్రభావిత గ్రామాల్లో విస్తృతంగా గస్తీ నిర్వహించాలని స్పష్టం చేశారు. అవసరమైతే పులిని సురక్షితంగా బంధించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులైన రెస్క్యూ బృందాలను పిలిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.