BREAKING
ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ నిధులు కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ .. రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు బీహార్ అభివృద్ధికి భారీ ఊతం పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ మనస్తాపంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల అవగాహన సదస్సు...

మేనిఫెస్టో హామీలకు మూడేళ్ల మంగళం! సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Select Suryaa Now
మేనిఫెస్టో హామీలకు మూడేళ్ల మంగళం!  సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

కొండాపూర్ ; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జి శేఖర్ విమర్శించారు. ప్రతిపక్షాలను విమర్శించడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.గతంలో వృద్ధులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు అందేవని, అధికారంలోకి వస్తే పింఛన్లు రూ.4 వేలకు పెంచుతామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ వంటి హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని అన్నారు.రాజీవ్ యువ వికాసం కింద యువతకు సబ్సిడీ రుణాలు, దళిత బంధు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రైతులకు రైతు భరోసా పూర్తిస్థాయిలో అందడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, వ్యవసాయ విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ఇప్పటికైనా ఎన్నికల హామీలన్నీ అమలు చేసి పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని శేఖర్ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిలో ముందంజలో ఉందని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు.