సూర్య కరీంనగర్ : అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లోని కేంబ్రిడ్జ్ ఎర్లీ ఇయర్స్ 1, 2 విద్యార్థుల కోసం అనుభవపూర్వక అభ్యసనంలో భాగంగా నవంబర్ 21న అగ్నిమాపక కేంద్రం సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులు అగ్నిమాపక కేంద్రంలోని ఫైర్ ఇంజిన్లు, అగ్నిమాపక పరికరాలు, రక్షణ కవచాలు తదితర సామగ్రిని ఆసక్తిగా పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తాము చేపట్టే చర్యలు, మంటలను ఆర్పే విధానాలు, ప్రజల ప్రాణాలను రక్షించడంలో తమ బాధ్యతలను చిన్నారులకు అర్థమయ్యే రీతిలో వివరించారు.అలాగే అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండటం, అత్యవసర పరిస్థితుల్లో పెద్దల సహాయం తీసుకోవడం వంటి ముఖ్యమైన భద్రతా అంశాలను తెలియజేశారు. ఫైర్ ఇంజిన్‌ను దగ్గరగా చూడటం, అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడటం చిన్నారుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి.ఈ కార్యక్రమానికి సహకరించిన అగ్నిమాపక శాఖ సిబ్బందికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. డైరెక్టర్ శ్రీ అనుదీప్ సౌగాని గారి ప్రోత్సాహంతో విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు నిజజీవిత అనుభవాల ద్వారా నేర్చుకునే అవకాశాలను అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ నిరంతరం కల్పిస్తోంది.