BREAKING
ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ నిధులు కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ .. రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు బీహార్ అభివృద్ధికి భారీ ఊతం పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ మనస్తాపంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఎల్‌నినో ప్రభావంతో రానున్న నీటి, విద్యుత్ సమస్యలపై విద్యార్థుల అవగాహన సదస్సు...

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

మెదక్  ప్రతినిధి ; ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎలాంటి తప్పులకు తావులేకుండా, పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పథకం అమలులో భాగంగా స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...అధికారులు ప్రతి లబ్ధిదారుడి వివరాలను సంబంధిత పోర్టల్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. నమోదు ప్రక్రియలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబర్ కీలకమని, ఈ వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని తెలిపారు.ఎవరి పేరుపై జీవిత బీమా నమోదు చేయించుకోవాలనుకుంటున్నారో కుటుంబ సభ్యుల నుంచి స్పష్టమైన వివరాలు సేకరించాలని సూచించారు.
ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే బీమా పొందే అవకాశం ఉన్నందున అర్హులైన వ్యక్తిని కుటుంబ సభ్యుల సమ్మతితో గుర్తించాలన్నారు. 
బీమా నమోదు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా నమోదు కేంద్రానికి స్వయంగా హాజరుకావాలని స్పష్టం చేశారు.అదేవిధంగా నామినీ వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోర్టల్‌లో నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు.
రేషన్ కార్డులో ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్న కుటుంబానికి ఈ పథకం కింద బీమా నమోదు చేసుకునే అవకాశం లేదని తెలిపారు.నెల రోజుల వ్యవధిలో బీమా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని, నిర్దేశిత గడువులోగా అర్హులైన లబ్ధిదారులందరి నమోదు పూర్తయ్యేలా స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్, ఈ డి యం సందీప్ లు పాల్గొన్నారు.