సూర్య కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో భవన విస్తరణ, నూతన ఆడిటోరియం, మొదటి అంతస్తు నిర్మాణ పనులకు ఉపకులపతి, రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ కలిసి భూమిపూజ చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం దాదాపు 14 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఇవి పూర్తయితే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విద్యతో పాటు విద్యార్థుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ డా. డి. హరికాంత్, ప్రిన్సిపాల్ డా. ఎన్.వి. శ్రీరంగ ప్రసాద్, ఆచార్య జాఫర్, రవీందర్ రెడ్డి, ఈశ్వర్, డా. ఎస్. రమకాంత్, డా. ఈ. మనోహర్, డా. కృష్ణకుమార్, డా. తిరుపతి, డా. మనోజ్ కుమార్, డా. బి. నరేష్, డా. బి. పరశురాములు, సావిత్రి, డా. అనిల్, కె. నాగరాజు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.