BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారి

Select Suryaa Now
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారి


అరకులోయ,అక్టోబర్ 31, మేజర్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జెడ్పిటిసి సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా అరకులోయ మండలంలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను జనరల్ ఎన్నికల పరిశీలకుడు రోణంకి. కూర్మనాథ్ ప్రత్యేకంగా శనివారం పరిశీలించారు. అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రం,స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.ఆయా కేంద్రాల్లో చేపడుతున్న ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు,ఎన్నికల సామగ్రి భద్రపరిచే విధానం తదితర అంశాలపై మండల స్థాయి ఎన్నికల అధికారులతో సమీక్షించారు.ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా, పారదర్శకంగా,సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అరకులోయ మండల ఎన్నికల అధికారి మాదశెట్టి. శ్రీధర్,సహాయ ఎన్నికల అధికారి–1,మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీసం.ప్రసాద్,ఎన్నికల సహాయాధికారి,స్థానిక తహసిల్దార్ జి.రాజా శ్రీధర్, జిల్లా పర్యాటకశాఖ అధికారి పట్టాసి.చలపతిరావు, డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఈశ్వర దొర,పిఆర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.