ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
పల్నాడు జిల్లా,రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి తెలిపారు. నవంబర్ 18 నుంచి 20 వరకు సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిబంధనలు అమలు చేస్తూ, డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కిరణ్ కుమార్, పల్నాడు జిల్లా ప్రతినిధి