telangana
టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి
సూర్య,లింగంపేట్ : లింగంపేట్ మండల టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్దిని నియమించడం జరిగిందని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం తెలిపారు.టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ సూచనల మేరకు మంగళవారం హైదరాబాద్ లోని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత గోవర్ధన్ రెడ్డిని రైతు కమిటి మండల అధ్యక్షుడుగా నియమించారని పేర్కొన్నారు.రైతు సమస్యలపై పోరాడుతు మండలంలో పార్టీని బలోపేతం చేయాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షుడు జైల్ సింగ్,మండల యూత్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి,జిల్లా నాయకులు శ్రీకాంత్,మండల మహిళా అధ్యక్షురాలు సావిత్రి,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బ్యాగరి సాయిలు,బుర్ర కృష్ణ గౌడ్,సెక్రటరీ మహేందర్,రమేష్,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.