నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి - టిడిపి పరిశీలకులు మోహన్ రెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏఎస్ పేట, సంగం, చేజర్ల మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు మరియు ముఖ్య నాయకులతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం ఉదయం ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆత్మకూరు నియోజకవర్గ అబ్జర్వర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శనివారపు మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగినది.
ఈ సందర్భంగా శనివారం మోహన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏఎస్ పేట, సంగం, చేజర్ల మండలాలలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఏ ఎం సి /పీఏసీఎస్ మరియు వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని కోరారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులందరూ ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను మంత్రి ఆనం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, నాయకులపై ఉందని అన్నారు.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో ఆత్మకూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.