telangana
ఈ నెల 18న ఎమ్మెల్యే చే లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ - ఎంపీడీవో ఉమర్ షరీఫ్
సూర్య, జన్నారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఈ నెల 18న మధ్యాహ్నం మండలంలోని పొనకల్ రైతు వేదికలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందని, సకాలంలో లబ్ధిదారులు రైతు వేదికలో హాజరు కావాలన్నారు.