BREAKING
ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య గుర్తించిన సమస్యలు.. పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రస్థానం! ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేయాలి అంకాలమ్మ ను దర్శించుకున్న మాజీ ఎమ్యెల్యే సతీమణి కదిరి రాణి ఘనంగా 1995-96 ఎస్ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. బోరంపల్లి టిడిపికి షాక్.. వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు. దుబ్బాక నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయండి రామాయణంలో సీత పాత్ర వివాదంపై స్పందించిన నితిష్ తివారీ: ప్రాచీన గ్రంథాల ఆధారంగా స్ట్రాంగ్ కౌంటర్! ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్ధే ధ్యేయం! టి. నరసాపురాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతా.. కూటమి సర్పంచ్ అభ్యర్థి చాట్రాతి యుగంధర్ హామీ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు భక్తిశ్రద్ధలతో లింబాద్రిగుట్టపై ధ్వజారోహణం జండా వీధిలో కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం.. అబ్దుల్ అజీజ్‌కు ఘన సత్కారం వింజమూరు మండలంలో జోరుగా పంచాయతీ నామినేషన్లు ఉపాసన కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు: పిల్లల పెంపకంలో సమానత్వంపై చర్చ! ఈఎంఆర్ఎస్ గాంధారి విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్

13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ ముమ్మర ప్రచారం ప్రజాసేవే లక్ష్యం.. వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

Select Suryaa Now
13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ ముమ్మర ప్రచారం  ప్రజాసేవే లక్ష్యం.. వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

కావలి, మేజర్ న్యూ స్: కావలి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పాలడుగు పద్మశ్రీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొంటూ వార్డులోని ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వార్డులో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు. ప్రజల ఆదరాభిమానాలతో తనకు అవకాశం కల్పించి, తెలుగుదేశం పార్టీ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వివిధ కాలనీల్లో కొనసాగుతున్న ఈ ప్రచారానికి స్థానికుల నుంచి ఆదరణ లభిస్తోందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రజల ఆశీస్సులతో 13వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పాలడుగు పద్మశ్రీ తెలిపారు.