ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య గుర్తించిన సమస్యలు.. పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రస్థానం!
నెల్లూరు, మేజర్ న్యూస్ : ఎన్నికల ప్రచార సమయంలో 21వ డివిజన్‌లో ప్రతి గడపను తాకుతూ ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి నూతన కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల కార్యాచరణ ప్రారంభించారు. ఈ క్రమంలో అడిషనల్ కమిషనర్ శ్రీమతి హిమబిందు తో కలిసి డివిజన్‌లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారులకు వివరిస్తూ ఆయా ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ప్రధానంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు:
1. చకల కాలువ బ్రిడ్జి: మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారిన బ్రిడ్జిని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు.
2. రివాల్ట్ వాల్ పక్కన మార్గం: రౌండ్ తూము నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని సూచించారు.
3. గుర్రాల మడుగు సంఘం: రీడింగ్ రూమ్ పక్కన కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు.
4. ఆదిత్య నగర్ డ్రైనేజీ: పాత కాలువల సమస్యకు శాశ్వత పరిష్కారంగా నూతన డ్రైనేజీ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
5. ట్రాఫిక్ భద్రత: సాయిబాబా మందిరం, స్వామిదాస్ స్కూల్, అపోలో జంక్షన్, చిల్డ్రన్స్ పార్క్ వద్ద జీబ్రా క్రాసింగ్‌లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు.
6. శాంతిభద్రతలు: చిల్డ్రన్స్ పార్క్ వద్ద పోలీస్ పికెట్, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
7. వీధి కుక్కలు: కుక్కల నియంత్రణ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని కోరారు.
8. పారిశుద్ధ్యం: అదనపు స్వీపర్ల నియామకం, సమర్థవంతమైన చెత్త సేకరణ విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
9. వీధి దీపాలు: పనిచేయని లైట్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
10. రోడ్డు ప్రమాదాల నివారణ: అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, జంక్షన్ సూచిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ రాజకీయ జవాబుదారీతనం, పారదర్శకత తమకు స్ఫూర్తి అని తెలిపారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
మంత్రి శ్రీ పొంగూరు నారాయణ నాయకత్వంలో నెల్లూరు నగర అభివృద్ధికి జరుగుతున్న కృషికి అనుగుణంగా 21వ డివిజన్‌లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు.
అడిషనల్ కమిషనర్ హిమబిందు సమస్యలపై సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు కార్పొరేటర్ వెల్లడించారు.
జనసేన నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజల మధ్య గుర్తించిన సమస్యలను ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు, అధికారులకు, కూటమి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ 21వ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ప్రజల హర్షం:
ఎన్నికల సమయంలో తమ సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్, ఇప్పుడు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారానికి కృషి చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల మధ్య గుర్తించిన సమస్యలు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన బాధ్యత.. పరిష్కారం దిశగా నిరంతర ప్రయత్నం.. ఇదే మా ప్రజాసేవా కార్యాచరణ!
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్, చండ్ర మధు, విజయలక్ష్మి, విశ్వ, సునీత, నరహరి, శ్రీను, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.