నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ
నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఓర్వకల్లు మండలంలోని నన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన, కథా పఠనం, కవితా గానం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు.
గ్రంథాలయాల ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు చదివే అలవాటును పెంపొందించడమే వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని గ్రంథాలయ ప్రతినిధి కౌశల్య తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెక్కల మద్దిలేటి మాట్లాడుతూ.. పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, 'రీడ్ టు లెర్న్.. లెర్న్ టు లీడ్' అనే నినాదాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రంథాలయ ఇన్‌చార్జి శ్రీకాంత్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.