దామచర్ల జనార్దన్ రావు గారి సమక్షంలో ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు ఒంగోలు మండలం వలేటివారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీ మాజీ వార్డ్ మెంబెర్ కోటపూరి చిరంజీవి, వైసీపీ నాయకులు గొట్టిపాటి సురేష్, ఏద్దు ఏషుపాదం,ఏద్దు సెల్వరాజు,మట్టిపల్లి శేఖర్ బాబు ,దానం హరిబాబు,మైలవరపు సురేష్, నల్లపోతుల రాము,శ్రావణి ,డేవిడ్ రాజు మరియు తదితరులు అనువారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి సమక్షంలో ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగినది.ఈ కార్యక్రమం లో ఒంగోలు మండల క్లస్టర్ కన్వినర్ నల్లమోతు గంగాధర్, పాతూరి పూర్ణ, ఒంగోలు మండల తెలుగు యువత అధ్యక్షులు వలేటి రాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.