పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు..
శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ దంపతులు..
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్ : జూబ్లీహిల్స్ శాసనసభ్యులు వి. నవీన్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు యూసుఫ్‌గూడ బస్తీలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ తన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తులాభారం: అనంతరం ఆలయం ఎదుట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తులాభార కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖలీద్, ఏజీ కాలనీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్జు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. తులాభారంలో ఒకవైపు నగదు (డబ్బులు), మరోవైపు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూర్చొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.