telangana
టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు
సూర్య మంచిర్యాల: మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల యూనిట్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న 25 మంది రెవెన్యూ శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.జిల్లాలోని మిగిలిన యూనిట్లలోనూ త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.అన్ని రంగాల్లో మంచిర్యాల జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు,మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్,కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షుడు ప్రకాష్‌తో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.