BREAKING
సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మీసేవ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ప్రత్యేక పిల్లలకు ‘రామాయణం’ సినిమా ప్రదర్శన శ్రీరాములు థియేటర్‌లో ఉదయం ఆటను వీక్షించిన లేఖాదీప్‌ విద్యార్థులు టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు!

భూ పరిపాలన పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి - అధికారులకు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశం

Select Suryaa Now
భూ పరిపాలన పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి - అధికారులకు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశం
సూర్య మంచిర్యాల : భూ పరిపాలనకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు.మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు,సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూ పరిపాలన అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా విజిలెన్స్ కేసులు, భూదాన్ భూములు,భూముల రీసర్వే పురోగతి,హైకోర్టు కేసులు, భూ భారతి పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులు, భూసేకరణ, జి.ఓ. నంబర్లు 59, 76, 118,యు.ఎల్.సి. భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జిల్లాల వారీగా సమీక్షించారు. పెండింగ్ కేసుల స్థితిగతులు,వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.భూ భారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి,సంబంధిత భూ రికార్డులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.అదేవిధంగా జి.ఓ. 59, 76, 118, యు.ఎల్.సి.భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.విజిలెన్స్, ఇంటెలిజెన్స్ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, భూ పరిపాలన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు మాట్లాడుతూ భూ భారతి పెండింగ్ దరఖాస్తులను అధికారుల సమన్వయంతో నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు.జి.ఓ. నంబర్లు 59,76,118 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.పెండింగ్ దరఖాస్తులు,కేసుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ రికార్డులు,నివేదికలను ఎప్పటికప్పుడు నవీకరిస్తున్నట్లు వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాం,కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండే, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.