BREAKING
ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్ ఏఎస్ పేటలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. గ్రంధాలయం వారోత్సవాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇందిరమ్మ టవర్స్ కు విశేష స్పందన - అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి

అధికారులతో సమీక్షించిన కమిషనర్

Select Suryaa Now
అధికారులతో సమీక్షించిన కమిషనర్

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :   నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని బి.వి. నగర్ నగర్ నందు జరుగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనుల పై రైల్వే అధికారులు, ఆర్ అండ్ బి , మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం  నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ నిర్వహించారు.ఈసమావేశంలో  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు .
రైల్వే, ఆర్ అండ్ బి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, విద్యుత్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు వివిధ అంశాలపై  చర్చించాం అని  మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ తెలిపారు. 
బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన శాఖల మధ్య సమన్వయం, స్థల పరిశీలన, విద్యుత్, ఇతర సౌకర్యాల మార్పిడి, నిర్మాణ పనులను మరింత త్వరితగతిన చేసేందుకు వాటి పరిష్కార మార్గాలపై వివిధ శాఖల అధికారులతో కలిసి సమగ్రంగా చర్చించాం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు .
బి.వి. నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతోకాలంగా అవసరమైన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బి.వి. నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, రైల్వే గేటు వద్ద ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయనితెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు . ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఈఈ శేషగిరి రావు, ఇన్చార్జి  సిపి రఘునాధరావు డిఈ సాయి కృష్ణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.