telangana
కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం
సూర్య కరీంనగర్ : విద్యారంగంలో అంకితభావంతో, విద్యార్థుల విజయం, సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి కోసం విధులకు మించి కృషి చేసినందుకు గుర్తింపుగా కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కి తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నుండి ప్రశంసా పత్రం లభించింది.తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా సంచాలకులు డా. ఇ. నవీన్ నికోలస్, ఐ.ఏ.ఎస్. చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.విద్యార్థులకు వనరులు సమకూర్చడం, నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించడం, నిస్వార్థ సేవ, వినూత్న ఆలోచనలతో విద్యలో నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు ఈ గౌరవం దక్కిందని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. ఆయన నిరంతర కృషి, అసాధారణ ప్రయత్నాలు ఉపాధ్యాయ వర్గానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని, పాఠశాలలు, పిల్లల భవిష్యత్తు రూపకల్పనకు ఎంతో దోహదపడ్డాయని అభినందించారు.ఈ సందర్భంగా డి. శ్రీనివాస్ మాట్లాడుతూ, తనకు లభించిన ఈ గౌరవాన్ని తన సహచర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అంకితం చేస్తున్నానని, భవిష్యత్తులోనూ విద్యార్థుల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.