BREAKING
సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మీసేవ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ప్రత్యేక పిల్లలకు ‘రామాయణం’ సినిమా ప్రదర్శన శ్రీరాములు థియేటర్‌లో ఉదయం ఆటను వీక్షించిన లేఖాదీప్‌ విద్యార్థులు టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు!

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం - మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

Select Suryaa Now
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం - మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
సూర్య కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏఒక్కటి కూడ నెరవేర్చలేదని ఆరోపిస్తూ కరీంనగర్ నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో... తెలంగాణ చౌక్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గంగుల... కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను చింపి చెత్తబుట్టలో వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, కార్పొరేటర్ షేక్ యూసుఫ్, బిఆర్ ఎస్ నాయకులు సుంకి శాల సంపత్ రావు, మాజీ కార్పొరేటర్ లు , డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.