BREAKING
సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మీసేవ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ప్రత్యేక పిల్లలకు ‘రామాయణం’ సినిమా ప్రదర్శన శ్రీరాములు థియేటర్‌లో ఉదయం ఆటను వీక్షించిన లేఖాదీప్‌ విద్యార్థులు టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు!

గన్నవరంలో వైఎస్సార్సీపీ తరఫున భార్గవి, కిరణ్ కుమార్ నామినేషన్లు.. 1వ వార్డు నుంచి దేశబోయిన భార్గవి.. 15వ వార్డు నుంచి పిన్నిబోయిన కిరణ్ కుమార్ బరిలోకి..

Select Suryaa Now
గన్నవరంలో వైఎస్సార్సీపీ తరఫున భార్గవి, కిరణ్ కుమార్ నామినేషన్లు..  1వ వార్డు నుంచి దేశబోయిన భార్గవి..   15వ వార్డు నుంచి పిన్నిబోయిన కిరణ్ కుమార్ బరిలోకి..

గన్నవరం, మేజర్ న్యూస్.

గన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు విద్యావంతులు వార్డు సభ్యులుగా ఎన్నికల బరిలోకి దిగారు. గన్నవరం గ్రామంలోని 1వ వార్డు నుంచి దేశబోయిన భార్గవి, 15వ వార్డు నుంచి పిన్నిబోయిన కిరణ్ కుమార్ మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా దేశబోయిన భార్గవి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని, వార్డు ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాననే ఆకాంక్షతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. విద్యావంతురాలిగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె మద్దతుదారులు పేర్కొంటున్నారు. అదే విధంగా 15వ వార్డు అభ్యర్థి పిన్నిబోయిన కిరణ్ కుమార్ సైతం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో పోటీకి సిద్ధమయ్యారు. విద్యావంతుడైన ఆయనకు స్థానిక సమస్యలపై అవగాహన ఉందని, ప్రజల ఆదరణతో వార్డు అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇద్దరు అభ్యర్థులు ఒకేరోజు నామినేషన్లు దాఖలు చేయడంతో ఆయా వార్డుల్లో ఎన్నికల సందడి నెలకొంది. ప్రజల ఆశీస్సులు, ఓటర్ల ఆదరణతో తమకు అవకాశం కల్పించాలని భార్గవి, కిరణ్ కుమార్ కోరుతున్నారు. ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల బరిలో నిలిచిన ఈ ఇద్దరు అభ్యర్థులకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు.

జర్నలిస్ట్:: గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణాజిల్లా.