మురుగు కాలువల పూడికతీతకు పంచాయితీసు అధికారుల చర్యలు
వింజమూరు, మేజర్ న్యూస్ : వింజమూరులో మురుగు కాలువల పూడికతీతకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో జరుగుతున్న మురుగు కాలువల పూడికతీత పనులను డిప్యూటీ ఎంపీడీవో కే రామారావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ వద్ద నుండి పిసిరి వాగు వరకు ఉన్న డ్రైనేజీ పలుచోట్ల వ్యర్ధాలతో నిండిపోవడంతో అలాగే కొంతమంది డ్రైనేజీ కాలువ వరకు దుకాణాలను ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు అయినప్పటికీ సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా ఈ పూటకితీత పనులను ఉన్న సిబ్బంది మరియు రోజువారి కూలీలతో పూడిక తీత పనులు చేపట్టామని స్థాయిలో పూడిక తీయించి మురుగునీరు సక్రమంగా పోయేందుకు చర్యలు చేపడతామని తెలిపారు .