BREAKING
పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మీసేవ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ప్రత్యేక పిల్లలకు ‘రామాయణం’ సినిమా ప్రదర్శన శ్రీరాములు థియేటర్‌లో ఉదయం ఆటను వీక్షించిన లేఖాదీప్‌ విద్యార్థులు టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు! గన్నవరంలో వైఎస్సార్సీపీ తరఫున భార్గవి, కిరణ్ కుమార్ నామినేషన్లు.. 1వ వార్డు నుంచి దేశబోయిన భార్గవి.. 15వ వార్డు నుంచి పిన్నిబోయిన కిరణ్ కుమార్ బరిలోకి..

పొలం పిలుస్తుంది

Select Suryaa Now
పొలం పిలుస్తుంది

   

నకరికల్లు మేజర్ న్యూస్: నకరికల్లు మండలం రూపెనగుంట్ల రైతు సేవా కేంద్రం పరిధిలోని రూపెనగుంట్ల, తురకపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కె. దేవదాస్ ఆయా గ్రామాల్లో సాగు చేస్తున్న మినుము, మొక్కజొన్న, కంది పంటలను పరిశీలించి, రైతులకు పంటల యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల విక్రయాల కోసం ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) విధానం ద్వారా రైతులు స్వయంగా యాప్‌లో క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకొని, తాము సాగు చేస్తున్న పంటకు అవసరమైన ఎరువులను నచ్చిన డీలర్ వద్ద కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.భూమి కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా 11 అంకెల రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) పొందాలని సూచించారు. ఈ గుర్తింపు సంఖ్య ద్వారా ఎరువులు, విత్తనాలు, అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాలతో పాటు పంట ఉత్పత్తుల విక్రయాలు, ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుందని వివరించారు. ఇప్పటివరకు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందని వారు ఆయా గ్రామాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు.

అలాగే రైతులు తమ స్మార్ట్‌ఫోన్లలో ఏపీఏఐఎంఎస్ (APAIMS) ఫార్మర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వ్యవసాయ శాఖ అందించే సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు.

రబీ సీజన్‌లో శనగ సాగు చేసే రైతులు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతే విత్తుకోవాలని సూచించారు. దీనివల్ల నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఎం. పవన్ కుమార్, పి. పవన్ కుమార్, పలువురు రైతులు పాల్గొన్నారు.