BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో శరవేగంగా  అభివృద్ధి పనులు ఆసిఫాబాద్‌లో మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థల పరిశీలన అమ్మవారి సందర్శనం సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మీసేవ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం

ఆర్కే 5 గనిలో ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ తనిఖీలు

Select Suryaa Now
ఆర్కే 5 గనిలో ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ తనిఖీలు
సూర్య నస్పూర్ : భద్రతతో కూడిన బొగ్గు ఉత్పత్తిలో శ్రీరాంపూర్‌ ఏరియా మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఆర్కే న్యూటెక్‌, ఆర్కే 6 భూగర్భ గనులు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ సాధించగా, ఈసారి కూడా విజయపరంపర కొనసాగించాలని జీఎం మునిగంటి శ్రీనివాస్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆర్కే 5 గనిలో ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఎవాల్యుయేషన్‌ అండ్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ తనిఖీలు నిర్వహించింది. కోల్‌ కంట్రోలర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా అత్యుత్తమ బొగ్గు గనులను ఎంపిక చేస్తున్నారు. భద్రతతో కూడిన ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సాంకేతికత, ఉద్యోగుల సంక్షేమం తదితర ఏడు అంశాలను పరిశీలించి రేటింగ్‌ కేటాయిస్తారు. 2024-25లో ఆర్కే న్యూటెక్‌ గని 99 శాతం మార్కులతో దేశంలో మొదటి స్థానంలో నిలవగా, ఆర్కే 6 గని మూడో స్థానాన్ని దక్కించుకుంది. తనిఖీలకు వచ్చిన కమిటీ సభ్యులు బి.ఎన్‌. పండిట్‌, పి. మోహన్‌రావు, పి. శ్రీధర్‌, ఏ. కృష్ణమోహన్‌రావు, కె. రఘుకుమార్‌లకు జీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ, ఓగ్గుడోలు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాన్ఫరెన్స్‌ హాల్లో గని ఉత్పత్తి, భద్రత, ప్రమాదాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నివేదికలను పరిశీలించారు. గని మేనేజర్‌ సుధీర్‌కుమార్‌ ఝా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం భూగర్భ గనిలో మ్యాన్‌రైడింగ్‌, ట్రైనింగ్‌ గ్యాలరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ,  భద్రత, ఉత్పత్తి, సాంకేతికతలో మెరుగుదలే ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ తనిఖీల ప్రధాన ఉద్దేశమన్నారు. శ్రీరాంపూర్‌ ఏరియా హ్యాట్రిక్‌ సాధించాలని ఆకాంక్షించారు. జీఎం మునిగంటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ,  దేశవ్యాప్తంగా టాప్‌ 10 శాతంలో ఎంపికైన గనుల్లో శ్రీరాంపూర్‌ ఏరియా నుంచి ఆర్కే 5, ఆర్కే న్యూటెక్‌, ఎస్ఆర్పీ 1 గనులు చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. ఈ మూడు గనులు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ సాధించేలా అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీ సైదా, ఎస్‌వోటూ జీఎం కృష్ణప్రసాద్‌, ఏజెంట్‌ ఎన్‌. శ్రీధర్‌, ఐకే ఓసీ పీవో ఏ.వి. రెడ్డి, ఎస్ఆర్పీ గ్రూప్‌ ఏజెంట్‌ రవికుమార్‌, ఏరియా ఇంజినీర్‌ రామకృష్ణ, సేఫ్టీ ఆఫీసర్‌ సత్యనారాయణ, సెక్యూరిటీ ఆఫీసర్‌ హనుమాన్‌ గౌడ్‌, క్వాలిటీ ఇన్‌చార్జి శ్రీధర్‌రావు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.