విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు
వింజమూరు, మేజర్ న్యూస్ : పాఠశాలలో విద్యార్థి దశలో విద్యార్థులకు చదువుతోపాటు చిత్రలేఖనం వ్యాసరచన వక్తృత్వ క్విజ్ క్రీడా పోటీలలో ఆసక్తి పెంపొందించుకోవాలని ప్రధానోపాధ్యాయులు జి వీర రాఘవులు పేర్కొన్నారు మంగళవారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నాలుగవరోజు వింజమూరు శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జ్యోతి కొండయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వ్యాసరచన చిత్రలేఖనం వక్తృత్వ పోటీలలో పాల్గొని తన సృజనాత్మకతను పెంపొందించుకోవాలని తెలిపారు ఇప్పుడు విద్యార్థులు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్న భయాన్ని పొందుతున్నారని ఆ భయాన్ని వదులుకొని నేను చేయగలను ధైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు ఇప్పటినుండి వేదికలపై మాట్లాడడం పోటీలలో పాల్గొనడం వంటివి చేయాలని అలా చేసినప్పుడే తనలో ఉన్న సృజనాత్మకత బయటపడుతుందని అన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెప్పే బోధనా అంశాలను సక్రమంగా విని వాటిని చదవడం చేయడం ద్వారా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని గమ్యాన్ని చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు ఉన్నారు.