దొరిగిళ్లు పంచాయితీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. గడ్డం నర్మదా రెడ్డి
మండల పరిధిలోని దొరిగల్లు పంచాయతీ సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పంచాయితీ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న గడ్డం నర్మదా రెడ్డి తెలిపారు, అభివృద్ధికి నోచని దొరికిన పంచాయితీ సమగ్ర అభివృద్ధికి ప్రజలు, అధికారుల సహాయ సహకారాలు, గత 30 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం కలిగి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తన భర్త గడ్డం ఓబిరెడ్డి, కూటమి నాయకుల సహాయ సహకారాలతో బడుగు బలహీనవర్గాల అభివృద్ధి, పంచాయతీ పురోభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, అభివృద్ధి కాంక్షించే విజ్ఞులైన ఓటర్లు తమ విలువైన ఓటు ద్వారా ఆశీర్వదించాలని నర్మదా రెడ్డి కోరారు