BREAKING
టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు! గన్నవరంలో వైఎస్సార్సీపీ తరఫున భార్గవి, కిరణ్ కుమార్ నామినేషన్లు.. 1వ వార్డు నుంచి దేశబోయిన భార్గవి.. 15వ వార్డు నుంచి పిన్నిబోయిన కిరణ్ కుమార్ బరిలోకి.. ఇంజనీరింగ్ కళాశాలలో సందర్శించిన విద్యార్థులు గ్రంథాలయాలు ఎందరో మేధావుల జ్ఞాన సంపదకు నిలయాలు పుస్తక పఠనం విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయి భూ పరిపాలన పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి - అధికారులకు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశం ఎవెంజర్స్ డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ: భారత్‌లో షురూ అయిన మార్వెల్ క్రేజ్! బల్లిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా సుందరయ్య నామినేషన్ దామచర్ల జనార్దన్ రావు గారి సమక్షంలో ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం - మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పొలం పిలుస్తుంది కర్ణాటకలోని శక్తివంతమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన పాన్-ఇండియా స్టార్ ప్రభాస్.. అమ్మవారి ప్రత్యేక పూజలు! ఈ ఏడాది కూడా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి 13వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు పామాంజి గోవిందు వైసీపీలో చేరిక...

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ: సీఐ

Select Suryaa Now
సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ: సీఐ

చీపురుపల్లి మేజర్ న్యూస్: సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు ఉంటుందని సీఐ జి శంకరరావు స్పష్టం చేశారు. మండలంలోని పేరిపి, అలజంగి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తినా, చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పెరిపి, అలజంగి గ్రామాలలో సీఐ తో పాటు పి. ఉమా వెంకటేశ్వర్ రావు సంయుక్తంగా గ్రామస్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శంకర  రావు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా గ్రామంలో ఎటువంటి గొడవలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా అందరూ సంయమనం పాటించాలని సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామ ప్రజలందరూ భయాందోళనలు వీడి, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని  పిలుపునిచ్చారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా