రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి
మదనపల్లె,మేజర్ న్యూస్ : నేతన్న సేవలో రెండో విడత విడుదల చేసి అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఎపి రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ,చేనేత జౌళి శాఖ మంత్రి యస్.సవితమ్మకి ఐపీసీ చేనేత,ఓబిసి ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్
వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.నేతన్న నేస్తం రెండవ విడత అర్హులైన చేనేత కుటుంబాలకు ప్రతి ఏటా రూ.25 వేలు ఆర్థిక సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారా అందించాలని,మగ్గాల ఆధునీకరణ,దారాలు,రంగుల కొనుగోలుకు ఈ సాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రెండవ విడత నేతన్న సేవలో విడుదల ఆలస్యమైందని,వెంటనే నిధులు జమయ్యే విధంగా చొరవ చూపాలని మంత్రిని కోరామన్నారు.ఎన్టీఆర్ భరోసా పింఛను వయసు మీదపడిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛను కింద ప్రతినెలా రూ.4 వేల అందిస్తున్నారన్నారు.చేనేత రంగంలో అర్హత కలిగిన కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని నేతన్న సేవలో రెండో విడత విడుదల చేయడంతోపాటు చేనేత సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని వీరభాస్కర్ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మోడెం సూరి అప్పారావు,అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాదినేని రమేష్ నాయుడు,గాలివీడు మండలం అధ్యక్షులు శిబ్యాల వెంకటరమణ,చేనేత మహీళా అధ్యక్షురాలు యు.శ్రీదేవి,జిల్లా ఉపాద్యక్షులు షేక్ బాబ్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి