ఉల్లాసంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : విద్యార్థులకు వ్యాసరచన,మ్యూజికల్ చైర్స్ పోటీలు : గ్రంథాలయాధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి
కురబలకోట,మేజర్ న్యూస్ : తంబళ్లపల్లి నియోజకవర్గం,కురబలకోట శాఖ గ్రంధాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి.ఇందులో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన,మ్యూజికల్ చైర్స్ పోటీలను గ్రంథాలధికారి బి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం,ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి ఆదేశాల మేరకు 59వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు.ప్రతిరోజు ఏదో ఒక అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఐదోరోజు నిర్వహించిన వ్యాసరచన,మ్యూజికల్ చైర్స్ పోటీలలో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారన్నారు.ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి గ్రంథాలయ వారోత్సవాల ముగింపు రోజున బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు ఎం.నాగమణి,బి.రమేష్,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి