BREAKING
టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం: తల్లులు, పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు! గన్నవరంలో వైఎస్సార్సీపీ తరఫున భార్గవి, కిరణ్ కుమార్ నామినేషన్లు.. 1వ వార్డు నుంచి దేశబోయిన భార్గవి.. 15వ వార్డు నుంచి పిన్నిబోయిన కిరణ్ కుమార్ బరిలోకి.. ఇంజనీరింగ్ కళాశాలలో సందర్శించిన విద్యార్థులు గ్రంథాలయాలు ఎందరో మేధావుల జ్ఞాన సంపదకు నిలయాలు పుస్తక పఠనం విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయి భూ పరిపాలన పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి - అధికారులకు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశం ఎవెంజర్స్ డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ: భారత్‌లో షురూ అయిన మార్వెల్ క్రేజ్! బల్లిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా సుందరయ్య నామినేషన్ దామచర్ల జనార్దన్ రావు గారి సమక్షంలో ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం - మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పొలం పిలుస్తుంది కర్ణాటకలోని శక్తివంతమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన పాన్-ఇండియా స్టార్ ప్రభాస్.. అమ్మవారి ప్రత్యేక పూజలు! ఈ ఏడాది కూడా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి 13వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు పామాంజి గోవిందు వైసీపీలో చేరిక...

ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం... టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి నాగూరు అరుణ

Select Suryaa Now
ఒక్క అవకాశం ఇవ్వండి...  ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం...  టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి నాగూరు అరుణ

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికలలో పేరూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఓటర్లు తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఓట్లు వేసి గెలిపించాలని, పంచాయతీ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దుతామని టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి నాగూరు అరుణ చెప్పారు. తన భర్త నాగూరు శ్రీనివాసులు రెండు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ టిడిపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి అనుచరుడుగా కొనసాగుతూ గ్రామపంచాయతీలో ఏ పదవి లేకపోయినా ఇప్పటివరకు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సర్పంచ్ ఎన్నికలలో నాగూర్ అరుణ అనే తనకు అవకాశం ఇచ్చి ఓట్లు వేసి గెలిపిస్తే అన్ని విధాలుగా పంచాయతీని అభివృద్ధి చేస్తానని తన మాటల్లో తెలిపారు.
 

1. మీరు సర్పంచ్ గా ఎన్నికైతే ఐదేళ్లలో గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు.?


సర్పంచ్ అభ్యర్థి: పంచాయతీ పరిధిలోని హరిపురం కాలనీ జనార్ధన్ కాలనీ స్మశాన వాటికల ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టడంతో పాటు ఆక్రమణలకు గురికాకుండా చేయడం, అంత్యక్రియలు నేర్చుకోవడానికి కావలసిన మౌలిక సదుపాయాలు బోరును ఏర్పాటు చేస్తాం. పంచాయతీ పరిధిలో అస్తవస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆధునికరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.
చెరువు ఆక్రమణలకు గురికాకుండా ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో ఇంజనీర్ ను పెట్టుకుని  సరిహద్దులను ఏర్పాటు చేసి భావితరాలకు ఆదర్శంగా పంచాయతీ ప్రజలందరి సహకారంతో  చెరువును కాపాడుకుంటాం.
ఇప్పటికే పంచాయతీలో ఇళ్లు నిర్మించుకున్న వారికి  కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎమ్మెల్యే నాని ఆధ్వర్యంలో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి  నుండి పట్టాలు ఇప్పించడం, జనార్ధన్ కాలనీ తారకరామా నగర్ కాలనీ లలో ఇప్పటికే సర్వే చేయడం జరిగిందని, ఎమ్మెల్యే సహకారంతో రెగ్యులరైజేషన్  చేయిస్తామని    పేర్కొన్నారు.
డీకేటీ ఇళ్లకు ఇంటి పన్నులు, కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు విద్యుత్ మీటర్లను  ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రజాసేవ లక్ష్యంగా అందరికీ ఇప్పిస్తాం.
 

2. గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుద్ధ్యం సమస్యల పరిష్కారానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించారు?


సర్పంచ్ అభ్యర్థి :
ప్రతిరోజు ఉదయం పంచాయతీ కార్మికులతో సమావేశమై ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం. రాత్రులు అన్ని విధుల్లో తిరిగి వీధిలైట్లు ఎక్కడైనా పనిచేయకపోతే మరుసటి రోజు మరమ్మత్తులు చేసి అందుబాటులోకి తేవడం.
 

3. పంచాయతీకి వచ్చే ప్రభుత్వ నిధులను పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా నిధులను వినియోగించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?


సర్పంచ్ అభ్యర్థి:
పంచాయతీలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారి గా వ్యవహరిస్తాం. ప్రజలందరి   ఆమోదయోగ్యమైన నిర్ణయాలను తీసుకొని గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం.
 

4. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను గెలిచిన తర్వాత కూడా అమలు చేస్తారని ప్రజలు ఎలా నమ్మాలి.?


సర్పంచ్ అభ్యర్థి: తన భర్త నాగూరు శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడిగా, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో ఏ పదవి లేకపోయినప్పటికీ  పంచాయతీ ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని  గ్రామపంచాయతీ అభివృద్ధి తన లక్ష్యంగా పాటుపడుతున్నారు. ఇక తనను ప్రజలందరూ ఎప్పుడు మీతో ఉండే తన భర్త  శ్రీనివాసులను దృష్టిలో పంచాయతీ మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆలోచించి ఒక్క అవకాశం ఇచ్చి తనకు ఓట్లేసి గెలిపించాలని నాగూరు అరుణ కోరారు. 
పంచాయతీలో ఆక్రమణలకు గురవుతున్న స్మశాన వాటికలకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఆయన సహకారంతో   ప్రహరీ గోడలు నిర్మించడం, జీవోస్ కాలనీ లో సిసి రోడ్లు, పంచాయతీ పరిధిలోని జనార్ధన కాలనీ, విజ్ఞాన్ నగర్, హరిపురం కాలనీ ప్రాంతాలలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి  సజావుగా వెళ్లేలా  డ్రైనేజీ కాలువలను నిర్మించాం. 
మీ ప్రత్యర్థి అభ్యర్థితో పోలిస్తే గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు సర్పంచ్ గా ఎన్నుకోవాలి.?
సర్పంచ్ అభ్యర్థి: పంచాయతీ పరిధిలోని
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ వీధికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్లిన ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది.
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, తన భర్త ఎమ్మెల్యేకి అనుచరుడుగా ఉండడం  తో పాటు సర్పంచ్ గా తాను పోటీ చేయడాన్ని ప్రజలు హర్షిస్తూ స్వాగతం పలుకుతున్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ప్రజలు తమకు మద్దతు ఇచ్చి ఓట్లు వేసి గెలిపించాలని, పంచాయతీని ప్రశాంతంగా ఉంచడంతోపాటు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా నీతివంతమైన పాలన అందిస్తామని టిడిపి సర్పంచ్ అభ్యర్థి నాగూరు అరుణ, ఆమె భర్త 
నాగూరు శ్రీనివాసులు తెలిపారు.

H. Dwaraka, staff reporter 

9705347341