మాతృభాష కన్నతల్లితో సమానం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రము అయిన భట్టిప్రోలు లోని శ్రీ మోటూరు రామారావు శాఖ గ్రంథాలయము లో 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 4 వ రోజైన మంగళవారం ఎంపీపీఎస్ (హెచ్ ఇ) పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఆమె మాట్లాడుతూ మాతృభాషను తల్లిలా గౌరవించాలని, తెలుగు భాషకు గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు సాహిత్యం ఉన్నాయని, విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయాలకు రావాలని, గ్రంథాలయంలో విభిన్న రకాల పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావాలని తెలియచేశారు. అనంతరం విద్యార్థులకు సీనియర్ విభాగంలో గ్రంథాలయాల ఉపయోగాలపై వక్తృత్వ పోటీలు, జూనియర్ విభాగంలో నీతి కథ చెప్పుటపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిన 72 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తులసి, శాఖ గ్రంథాలయాధికారి కలపాల సుభాష్ చంద్రబోస్, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.