BREAKING
వీఎస్‌యూ ఫార్మసీ కళాశాలలో ఘనంగా గెస్ట్ లెక్చర్, పోటీల నిర్వహణ. రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ జానపద పాట: వంద కోట్ల వ్యూస్‌ దిశగా రాను బొంబాయికి రాను! కావలి మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌ రోజా బర్త్‌డే వేడుకల్లో అలనాటి సినీ తారల సందడి: ఒకే ఫ్రేమ్‌లో మీనా, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్! విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు దొరిగిళ్లు పంచాయితీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. గడ్డం నర్మదా రెడ్డి 40 మందికి రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే నసీర్ మాతృభాష కన్నతల్లితో సమానం మోదీ చాలా కఠినమైన వ్యక్తి.. గొప్ప నాయకుడు: డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు చూస్తున్నంత సేపు దిమ్మతిరిగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం! ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి

బోరంపల్లి టిడిపికి షాక్.. వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు.

Select Suryaa Now
బోరంపల్లి టిడిపికి షాక్..  వైసీపీలో  చేరిన సీనియర్ నాయకులు.

*కళ్యాణదుర్గం: మండలం బోరంపల్లి గ్రామంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సుమారు 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ వచ్చిన పలువురు సీనియర్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుని వైసీపీలోకి వచ్చారు. టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన నాయకులు పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం గ్రామంతో పాటు నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సీనియర్ నాయకుడు ముదెప్పగారి కురుబ ఉమేష్, బుల్లిగుండ్ల పరంధామ, బులిగుండ్ల వేణు, బోయ మాదక్క గారి రాయుడు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ పార్టీ కోసం పనిచేసినా తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అందాయని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో పథకాలు పొందాలంటే నాయకుల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. జగనన్న నాయకత్వంపై నమ్మకంతో, తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అనంతరం తలారి రంగయ్య పార్టీలో చేరిన నాయకులకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకులు అవసరమని, ప్రజలకు సేవ చేయడమే రాజకీయాల ప్రధాన లక్ష్యం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడగట్ట నారాయణ, దొడగట్ట మురళి, మండల కన్వీనర్ సూర్యనారాయణ, బోరంపల్లి నాయకులు అంజనరెడ్డి, బలరాం, కృష్ణారెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, వరుణ్‌రెడ్డి, మదన్మోహన్‌రెడ్డి, హరికృష్ణ, ఆదినారాయణరెడ్డి, లింగప్పగారి మల్లయ్య, లింగప్పగారి రామాంజనేయులు, లింగప్పగారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామాంజనేయులతో పాటు వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోరంపల్లిలో చోటుచేసుకున్న ఈ చేరికలు స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.