BREAKING
వీఎస్‌యూ ఫార్మసీ కళాశాలలో ఘనంగా గెస్ట్ లెక్చర్, పోటీల నిర్వహణ. రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ జానపద పాట: వంద కోట్ల వ్యూస్‌ దిశగా రాను బొంబాయికి రాను! కావలి మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌ రోజా బర్త్‌డే వేడుకల్లో అలనాటి సినీ తారల సందడి: ఒకే ఫ్రేమ్‌లో మీనా, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్! విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు దొరిగిళ్లు పంచాయితీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. గడ్డం నర్మదా రెడ్డి 40 మందికి రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే నసీర్ మాతృభాష కన్నతల్లితో సమానం మోదీ చాలా కఠినమైన వ్యక్తి.. గొప్ప నాయకుడు: డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు చూస్తున్నంత సేపు దిమ్మతిరిగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం! ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి

ఈఎంఆర్ఎస్ గాంధారి విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్

Select Suryaa Now
ఈఎంఆర్ఎస్ గాంధారి విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి :  కామారెడ్డి జిల్లాలోని ఈఎంఆర్ఎస్ గాంధారి విద్యార్థుల ఘన విజయాలు  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థి, ఉపాధ్యాయ బృందం కామారెడ్డి ఈఎంఆర్ఎస్ గాంధారి పాఠశాల విద్యార్థులు సాధించిన విశేష విజయాలు సంస్థకు గర్వకారణంగా నిలిచాయి. పాఠశాలకు చెందిన విద్యార్థి కె. నవీన్ నీట్-2026 పరీక్షలో అర్హత సాధించి ప్రభుత్వ వైద్య కళాశాల, సిద్ధిపేటలో ప్రవేశం పొందగా, ఎల్. సంతోష్ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఈఎంఆర్ఎస్ సైన్స్ విభాగంలో టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటుకున్నారు. వీరిద్దరూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అరుదైన అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో కె. నవీన్, డీసీఓ కామారెడ్డి శ్రీనివాస్ స్వామి, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ అమర్ సింగ్, ఈఎంఆర్ఎస్ గాంధారి ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు గోపాల్ మండల్, ఈఎంఆర్ఎస్ గాంధారి ఎస్ఎస్ఏ ఎం. రవి తదితరులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి విద్యార్థుల విజయాలను వివరించారు. విద్యార్థుల ప్రతిభను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ, కె. నవీన్ నీట్‌లో అర్హత సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే ఎల్. సంతోష్ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పాఠశాలకు గర్వకారణమని కొనియాడారు.గిరిజన విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సమగ్ర వికాసానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని, అవసరమైన అన్ని విధాలుగా తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.విద్యార్థుల ఈ విజయాలు వారి కృషి, పట్టుదలతో పాటు ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శకత్వం, పాఠశాల యాజమాన్యం సహకారం మరియు జిల్లా అధికారుల ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ విజయాలు ఇతర గిరిజన విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పాఠశాల ప్రతినిధులు పేర్కొన్నారు.గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, సమగ్ర అభివృద్ధిని అందిస్తూ మరిన్ని విజయాలు సాధించే దిశగా ఈఎంఆర్ఎస్ గాంధారి నిరంతరం కృషి చేస్తోందనీ తెలిపారు.