BREAKING
రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ జానపద పాట: వంద కోట్ల వ్యూస్‌ దిశగా రాను బొంబాయికి రాను! కావలి మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌ రోజా బర్త్‌డే వేడుకల్లో అలనాటి సినీ తారల సందడి: ఒకే ఫ్రేమ్‌లో మీనా, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్! విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు దొరిగిళ్లు పంచాయితీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. గడ్డం నర్మదా రెడ్డి 40 మందికి రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే నసీర్ మాతృభాష కన్నతల్లితో సమానం మోదీ చాలా కఠినమైన వ్యక్తి.. గొప్ప నాయకుడు: డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు చూస్తున్నంత సేపు దిమ్మతిరిగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం! ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే

మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేయాలి

Select Suryaa Now
మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేయాలి

గజ్వేల్ ; .మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాస ప్యాకేజీలు వెంటనే అందించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టిఆర్పి జిల్లా ఉపాధ్యక్షులు పి, నర్సింగ్,
మొహమ్మద్ పాషా మాట్లాడుతూ భూములు, ఇళ్లు, జీవనాధారాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 19న సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్న సభలోగా ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న పరిహారం, పునరావాస ప్యాకేజీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్పి సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాబా, జిల్లా సహాయ కార్యదర్శి గాలింక స్వామి,  కార్యవర్గ సభ్యుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.