BREAKING
రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ జానపద పాట: వంద కోట్ల వ్యూస్‌ దిశగా రాను బొంబాయికి రాను! కావలి మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌ రోజా బర్త్‌డే వేడుకల్లో అలనాటి సినీ తారల సందడి: ఒకే ఫ్రేమ్‌లో మీనా, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్! విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు దొరిగిళ్లు పంచాయితీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. గడ్డం నర్మదా రెడ్డి 40 మందికి రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే నసీర్ మాతృభాష కన్నతల్లితో సమానం మోదీ చాలా కఠినమైన వ్యక్తి.. గొప్ప నాయకుడు: డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు చూస్తున్నంత సేపు దిమ్మతిరిగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం! ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే

ఘనంగా 1995-96 ఎస్ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

Select Suryaa Now
ఘనంగా 1995-96 ఎస్ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

దుబ్బాక ; దుబ్బాక నియోజక వర్గంలో ని అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో  1995-96 ఎస్ఎస్‌సీ  బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత కోలాహలంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరు పుకున్నారు.దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న చిన్ననాటి మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు అమ్మనా చెంద్రారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రంగయ్య భాస్కర్ రెడ్డి, పాఠశాల అటెండర్ నర్సయ్య ని పూర్వ విద్యార్థులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. తాము ఈ రోజు ఉన్నత స్థానాల్లో ఉండటానికి గురువుల మార్గదర్శకమే కారణమని పూర్వ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఆటపాటలు,ఒకే చోట భోజనాలతో రోజంతా ఆనందంగా గడిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ర్యాకం శ్రీరాములు రెడ్డి, బాల్ నర్సింలు, బన్న శ్యామ్, వనం ప్రవీణ్ కుమార్, ర్యాకం అశోక్, దేవాని యాదగిరి, మంగలి రవి, మంతురి స్కైలాబ్, బోరెడ్డి నర్సింహా రెడ్డి, భాస్కర్ గౌడ్, పేంటి మహేశ్వరీ, గాజుల నర్సవ్వ, సిలవేణి అరుణ, సంధ్య రాణి, వంగ నిర్మల, బొల్లారం రేణుక తదితరులు పాల్గొన్నారు.