BREAKING
రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ జానపద పాట: వంద కోట్ల వ్యూస్‌ దిశగా రాను బొంబాయికి రాను! కావలి మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌ రోజా బర్త్‌డే వేడుకల్లో అలనాటి సినీ తారల సందడి: ఒకే ఫ్రేమ్‌లో మీనా, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్! విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు దొరిగిళ్లు పంచాయితీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. గడ్డం నర్మదా రెడ్డి 40 మందికి రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే నసీర్ మాతృభాష కన్నతల్లితో సమానం మోదీ చాలా కఠినమైన వ్యక్తి.. గొప్ప నాయకుడు: డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు చూస్తున్నంత సేపు దిమ్మతిరిగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం! ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే

ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం

Select Suryaa Now
ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం

ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం

నేరేడుచర్ల మేజర్ న్యూస్

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ చైర్మన్ కొణతం వెంకట రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, నేరేడుచర్ల ఎస్సై సిహెచ్.గోపాల్ రెడ్డి, తహశీల్దార్ సురిగి సైదులు,  హైవే ఎఈ పాల్గొని మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కెట్ ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ప్రధాన రహదారులపై వాహనాల పార్కింగ్ క్రమబద్ధీకరణ, రహదారులపై ఆక్రమణల తొలగింపు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
పట్టణ అభివృద్ధి, ప్రజల సౌకర్యం, రహదారి భద్రత దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపారులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ నియంత్రణ అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.