తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే
lదుబ్బాక ..దుబ్బాక విద్యార్థుల చారిత్రాత్మక ఘనత
9 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొని.. 9 బంగారు పతకాలు సాధించి దుబ్బాక మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా భానూర్‌లో నవంబర్ 15న నిర్వహించిన తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో దుబ్బాక మండలానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారన్నారు. ఈ పోటీల్లో దుబ్బాక మండలం నుంచి 9 మంది విద్యార్థులు పాల్గొని, 9 బంగారు పతకాలు సాధించి 100 శాతం విజయాన్ని నమోదు చేశారని తెలిపారు.యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన దుబ్బాక మండలంలోని నాలుగు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటుకుని బంగారు పతకాలు కైవసం చేసుకున్నారన్నారు.
పాఠశాలల వారీగా బంగారు పతకాల వివరాలుమాస్టర్ మైండ్ స్కూల్ దుబ్బాక 5 గోల్డ్ మెడల్స్
సరస్వతి గ్లోబల్ స్కూల్ 2 గోల్డ్ మెడల్స్
గాయత్రి వివేకానంద విద్యాలయం 1 గోల్డ్ మెడల్రజనీకాంత్ రెడ్డి స్కూల్ 1 గోల్డ్ మెడల్బంగారు పతక విజేతలు
మాస్టర్ మైండ్ స్కూల్: హన్విక ప్రియా వివాన్ నక్షని హానిష్, సాత్విక్, క్రిష్.సరస్వతి గ్లోబల్ స్కూల్: రిశ్విత, శిల్పిత.గాయత్రి వివేకానంద విద్యాలయం: వర్ష.రజనీకాంత్ రెడ్డి స్కూల్: గగన్.అకాడమీ వ్యవస్థాపకులకు ప్రత్యేక సత్కారం చేశారని తెలిపారు.ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ సుశాంక్ వర్ధన్లను పవర్ డ్రాగన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా వారు మాస్టర్ మెమెంటోతో ఘనంగా సత్కరించి, డ్రాగన్ షో ప్రదర్శనతో అభినందించారు.
క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనం ఈ విజయంఈ సందర్భంగా కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ మాట్లాడుతూ. విద్యార్థులు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిరంతర సాధనతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని 100 శాతం విజయాన్ని సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్రస్థాయి విజేతలుగా తీర్చిదిద్దడంలో నిరంతర శిక్షణ ఎంతో కీలకమని తెలిపారు.
విద్యార్థులను ప్రోత్సహించి, పోటీల్లో పాల్గొనేలా సహకరించిన నాలుగు పాఠశాలల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రముఖుల అభినందనలు
ఈ విజయాన్ని పురస్కరించుకుని అర్ ఎస్ ఎస్ కె ఎ ఐ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ నగేష్, అర్ ఎస్ ఎస్ కె ఎ ఐ జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్, సుబ్బు షోటోకాన్ కరాటే అకాడమీ వ్యవస్థాపకులు సురేందర్ సుబ్బు, సుశాంక్ వర్ధన్, పి.టి. శ్రీనివాస్ గౌడ్ తదితరులు బంగారు పతక విజేతలను, యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు.దుబ్బాక మండల విద్యార్థుల ఈ విజయం కేవలం పతకాల సాధన మాత్రమే కాదు.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోనూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగగల ప్రతిభ ఉందని నిరూపించిన ఘనత.ఉందన్నారు.