వింజమూరు మండలంలో జోరుగా పంచాయతీ నామినేషన్లు
వింజమూరు, మేజర్ న్యూస్ : ఈనెల 26వ తేదీన పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగునుండగా అందుకు సంబంధించి నామినేషన్లు 15వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి తొలిరోజు ఆదివారం వింజమూరు మండల పరిధిలో సర్పంచ్ అభ్యర్థులకు ఐదు నామినేషన్లు వార్డు సభ్యులకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి అదే విధంగా రెండవ రోజు సోమవారం 51 సర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు 190 వార్డు సభ్యుల నామినేషన్లో దాఖలైనట్లు ఎంపీడీవో కే శ్రీనివాసులు తెలిపారు రెండు రోజులు కు మొత్తం 56 సర్పంచ్ అభ్యర్థి నామినేషన్లు 206 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు మూడవ రోజైన మంగళవారం నామినేషన్ వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్ల వివరాలు చాకలకొండ సర్పంచ్ అభ్యర్థులు ఐదుగురు వార్డు సభ్యులు 13 మంది జనార్ధనపురం సర్పంచ్ అభ్యర్థులు నలుగురు వార్డు సభ్యులు నలుగురు కాటేపల్లి సర్పంచ్ అభ్యర్థులు 6 వార్డు సభ్యులకు 19 రావిపాడు సర్పంచ్ అభ్యర్థులకు రెండు వార్డు సభ్యులు 10 వింజమూరు సర్పంచ్ అభ్యర్థులుగా ఆరుగురు వార్డు సభ్యులకు 47 మంది నామినేషన్లు వేశారు అలాగే బుక్కాపురం సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరు వార్డు సభ్యులకు పదిమంది ఏ కిస్తీపురం సర్పంచ్ అభ్యర్థులకు ఆరు వార్డు సభ్యులకు 19 గుండె మడగల సర్పంచ్ అభ్యర్థులు ముగ్గురు వార్డు సభ్యులు ఏడుగురు శంకవరం సర్పంచ్ అభ్యర్థులు 8 మంది వార్డు సభ్యులు 9 మంది నల్లగొండలో సర్పంచ్ అభ్యర్థులు ఐదుగురు వార్డు సభ్యులకు 27 మంది అలాగే ఊటుకూరు సర్పంచ్ అభ్యర్థులకు నలుగురు వార్డు సభ్యులకు 25 మంది నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు చివరి రోజు నామినేషన్లు వివరాలు తెలియాల్సి ఉంది.