BREAKING
ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య గుర్తించిన సమస్యలు.. పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రస్థానం! ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేయాలి అంకాలమ్మ ను దర్శించుకున్న మాజీ ఎమ్యెల్యే సతీమణి కదిరి రాణి ఘనంగా 1995-96 ఎస్ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. బోరంపల్లి టిడిపికి షాక్.. వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు. దుబ్బాక నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయండి రామాయణంలో సీత పాత్ర వివాదంపై స్పందించిన నితిష్ తివారీ: ప్రాచీన గ్రంథాల ఆధారంగా స్ట్రాంగ్ కౌంటర్! ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్ధే ధ్యేయం! టి. నరసాపురాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతా.. కూటమి సర్పంచ్ అభ్యర్థి చాట్రాతి యుగంధర్ హామీ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు భక్తిశ్రద్ధలతో లింబాద్రిగుట్టపై ధ్వజారోహణం జండా వీధిలో కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం.. అబ్దుల్ అజీజ్‌కు ఘన సత్కారం వింజమూరు మండలంలో జోరుగా పంచాయతీ నామినేషన్లు ఉపాసన కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు: పిల్లల పెంపకంలో సమానత్వంపై చర్చ! ఈఎంఆర్ఎస్ గాంధారి విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాళ్లూరు, కంభంపాడులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Select Suryaa Now
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాళ్లూరు, కంభంపాడులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల ముందస్తు చర్యలు
ఫ్లాగ్ మార్చ్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా డీసీపీ బి. లక్ష్మీనారాయణ ఐపీఎస్, నందిగామ ఏసీపీ చి. శ్రీనివాసరావు

వత్సవాయి, నవంబరు 17:

రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లూరు, కంభంపాడు గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా డీసీపీ (రూరల్) బి. లక్ష్మీనారాయణ ఐపీఎస్, నందిగామ ఏసీపీ చి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామాల్లో కవాతు నిర్వహిస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు.

గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఫ్లాగ్ మార్చ్ ద్వారా తెలియజేశారు.

ప్రజలు ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వత్సవాయి మండలంలోని సున్నితమైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పోలీస్ శాఖ భద్రతా చర్యలను ముమ్మరం చేస్తోంది.