BREAKING
వీఎస్‌యూ ఫార్మసీ కళాశాలలో ఘనంగా గెస్ట్ లెక్చర్, పోటీల నిర్వహణ. రెండవ విడత నేతన్న సేవలో వెంటనే విడుదల చేయాలి : ఐపిసిపి చేనేత ఓబీసీ ఛైర్మన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ : బిసి సంక్షేమ,చేనేత,జౌళిశాఖ మంత్రి సవితమ్మకు వినతి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ జానపద పాట: వంద కోట్ల వ్యూస్‌ దిశగా రాను బొంబాయికి రాను! కావలి మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. నన్నూరు పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహణ తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి రాప్తాడు నిందితుడు హేమంత్‌ డిశ్చార్జ్‌ రోజా బర్త్‌డే వేడుకల్లో అలనాటి సినీ తారల సందడి: ఒకే ఫ్రేమ్‌లో మీనా, ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్! విద్యార్థులకు ఇప్పటి నుండే వ్యాసరచన పోటీలు దొరిగిళ్లు పంచాయితీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. గడ్డం నర్మదా రెడ్డి 40 మందికి రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే నసీర్ మాతృభాష కన్నతల్లితో సమానం మోదీ చాలా కఠినమైన వ్యక్తి.. గొప్ప నాయకుడు: డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు చూస్తున్నంత సేపు దిమ్మతిరిగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ సూపర్ హిట్ చిత్రం! ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండండి

ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్ధే ధ్యేయం! టి. నరసాపురాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతా.. కూటమి సర్పంచ్ అభ్యర్థి చాట్రాతి యుగంధర్ హామీ..

Select Suryaa Now
ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్ధే ధ్యేయం!  టి. నరసాపురాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతా.. కూటమి సర్పంచ్ అభ్యర్థి చాట్రాతి యుగంధర్ హామీ..

టి. నరసాపురం, మేజర్ న్యూస్: ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా, గ్రామాభివృద్ధే ధ్యేయంగా టి. నరసాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన చాట్రాతి యుగంధర్ ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.అనంతరం అద్దంకి జగ్గారావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యుగంధర్ మాట్లాడుతూ.. సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. టి. నరసాపురం గ్రామ పంచాయతీని ఆదర్శంగా, మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి రవి, మాజీ సర్పంచ్ జోనుబోయిన సోంబాబు, జనసేన మండల నాయకుడు సీహెచ్ నవీన్ మాట్లాడుతూ.. యుగంధర్ కుటుంబం తరతరాలుగా ప్రజాసేవా దృక్పథంతో ముందుకు సాగుతోందని తెలిపారు. తాతముత్తాతల నుంచి సంక్రమించిన భూములను సైతం ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న కుటుంబమని వివరించారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు.ఈ ఎన్నికల్లో యుగంధర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఓటు వేసి గెలిపించాలని కొండపల్లి రవి, జోనుబోయిన సోంబాబు, సీహెచ్ నవీన్ గ్రామ ప్రజలను కోరారు. కార్యక్రమంలో అద్దంకి జగ్గారావు, కిలారి సాంబశివరావు, పాలేటి సత్యనారాయణ, కొరివి శ్రీకాంత్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

 అద్దంకి గిరి కుమార్ క్రైమ్ ప్రతినిధి ఏలూరు